Tuesday, January 19, 2010

అత్తా కోడలు

యుగయుగాలుగా ఈ అత్తా కోడళ్ళ గొడవలు వున్నాయి . యుగాలసంగతి సరే మన ప్రియతమ నాయకురాలు ఇందిరా గాంధీ కూడా చిన్న కోడలుని , ఇంట్లో నుండి వెళ్ళ గొట్టింది కదా ? ఈ మధ్య జి టి వీ లో నాలుగు వారాలుగా ప్రజావేదికలో , పరచూరి ఆధ్వర్యము లో అత్తా కోడళ్ళ చర్చ బహు రసవత్తరం గా సాగింది . ఎవరి వాదనలను వారు వినిపించారు . సరే ఎవరి వాదన వారికి కరెక్ట్ నే కదా . చివరికి పరుచూరి ఓ పిట్ట కథ చెప్పారు .

కురుక్షేత్ర సమరం జరిగేటప్పుడు అర్జునుడు , శ్రీకృష్ణుని తో కలిసి వేరే పక్కయుద్దం చేసివస్తాడు . అప్పటికి ధర్మరాజు , తదితరులకు చాలా దెబ్బలు తగులుతాయి . ధర్మజుడు , అర్జునుని చూడగానే , మమ్మలిని కాపాడలేని నీకు ఈ గాంఢివం ఎందుకు అవతల పారేయ్ అంటాడు . తన గాండీవాన్ని ఎవరూఎమైనా అంటే వారిని చంపేయటము అర్జునుని నియమం . అందుకే ఒరలోనుండి కత్తి తీస్తాడు . వెంటనే శ్రీకృష్ణుడు ఆగు బావా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు . నా గాండీవాన్ని అవమానించినవారిని చంపేయటము నా నియమము కదా అందుకే అన్నయ్యను చంపబోతున్నాను అంటాడు . ఐతే చంపేముందు మీ అన్నను , నీఇష్టం వచ్చినట్లుగా తిట్టు అంటాడు కృష్ణుడు . పిచ్చి పిచ్చిగా ధర్మజుని తిట్టి , చంపబోతాడు అర్జునుడు . వెంటనే శ్రీకృష్ణుడు ఇంకా ఎందుకు చంపటము ? అన్న , తండ్రి అంతటి వాడు . తండ్రిని తిడుతే చంపినట్లుగానే , కాబట్టి ఇంకా వేరుగా చంపక్కరలేదు అంటాడు . కాని మళ్ళీ అర్జునుడు ఒరలోనుండి కత్తి తీస్తాడు . మళ్ళీ ఏమైంది అంటాడు కృష్ణుడు . అన్నయ్యను చంపాక నేనెందుకు బతకటము అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటాడు అర్జునుడు . ఐతే , నిన్ను నువ్వు పొగుడుకో అంటాడు శ్రీకృష్ణుడు . అర్జునుడు పొంగిపోయి తనను తాను తెగ పొగుడేసుకొని , కత్తి తీస్తాడు . ఇంకా ఎందుకు ఆత్మహత్య చేసుకోవటము ? నిన్ను నువ్వు పొగుడుకోవటము ఆత్మహత్యాసమానమే , కనుక నువ్విక ఆత్మహత్య చేసుకోనవసరములేదు అని శ్రీకృష్ణుడు చిద్విలాసం గా నవ్వుతాడు ! కృష్ణుడు మేధావి కనుక ఆ సమస్యను అలా పరిష్కరించాడు . అలాగే మగవాడు , భర్త , తండ్రి అలా పరిష్కారించాలి . అత్తా కోడళ్ళ సమస్యను పరిష్కరించవలిసింది పురుషొత్తముడైన మగవాడే . అప్పుడే కుటుంబము లో కలతలు లేకుండా ప్రశాంతముగా వుంటుంది అని ముగించారు పరుచూరి .

నిజముగా ప్రపంచములో అంతటి పురుషోత్తములు ఎవరైనా వున్నారా ? ఇటు పెళ్ళం కొంగు పట్టుకునేవాడో , లేదా తల్లిచాటు బిడ్డడో తప్ప , ఇద్దరినీ బాలెన్స్ చేసవాడిని నేనైతే ఇంతవరకు చూడలేదు . బలవంతుడు , బలహీనుని అణచటము అన్నది ఎక్కడైనా వున్నది . అది ఎవరైనా కావచ్చు .

అసలు ఇంత గొడవేందుకు ? ఏదైనా గొడవ మొదలైతుంది , ఇద్దరికీ పడటము లేదు అనుకున్నప్పుడు , ఆ పురుషోత్తముడు పెళ్ళాన్ని తీసుకొని హాయిగా వేరు కాపురము పెడితే సరిపోతుంది కదా ? కొట్టుకుంటూ కలిసి వుండి బ్రతుకుని నరకము చేసుకునే బదులు విడివిడి గా వుండి అప్పుడప్పుడు కలుసుకుంటూ సంతోషముగా వుండవచ్చు . చివరి రోజులలో కొడుకులు చూసుకుంటారన్నది వుట్టిమాట . బాద్యతలు తీర్చుకున్నాక , పెద్ద దంపతులు హాయిగా వారి దారి వారు చూసుకోవటము మేలు . అప్పటికైనా ఎంజాయ్ చేయటము నేర్చుకుంటే మంచిది . పిల్లలు , పంపినప్పుడు ఏడ్చుకుంటూ , ఆశ్రమానికి వెళ్ళేబదులు , ఓపికలేని రోజులలో , డబ్బువుంటే మనిషిని పెట్టుకొని చేయించుకోవటమో , లేదా సొంతంగానే ఆశ్రములో చేరటము మేలు కదా .

6 comments:

swathi said...

ఇవ్వాళ బ్లాగ్ లో ఈ విషయం గురించి చదువుతుంటే ఎన్నో ఆలోచనలు మొదయలయ్యై .అవి పంచుకోవాలి అనిపించింది. ఈ విషయం లో నా పరిజ్ఞానం చాల తక్కువ.కానీ పెళ్లి అవగానే వేరుకాపురం పెట్టాలన్న ఆలోచన ఈ రోజుల్లో యూత్ ది. అసలు మనం మన ఇంట్లో అమ్మతో ,నాన్నతో అక్క తమ్ములతో ఎన్ని విషయాలలో గొడవపడకుండా ఉంటున్నాము. గొడవపడిన కూడా ఆ తర్వాత మర్చిపోతాం. ఒక ఇంట్లో వున్నప్పుడు అభిప్రాయబేధాలు సహజం.అంతమాత్రాన విడిగా వుండాలా?
చిన్నపటి నుంచి పెంచిన తల్లి తండ్రిని ఓపిక లేని ఆ వయస్సులో ఎవరో పరయి వాళ్ళని పెట్టుకుని,లేదా oldage హోం ఉండమనడం ఎంత దారుణం. ఇద్దరు వుద్ద్యోగాలు చేసే వాళ్ళు అయినా సరే అ పెట్టె మనిషిని మనింట్లో పెట్టి చేయిస్తే మనం వాళ్ళకి ఎదురగా వుంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. సర్దుకోవడం అనేది పూర్తిగ మర్చిపోయి వేరే వుంటే
నా బాధ నేను పడతాను అనుకోవడం స్వార్ధం కాదా? ఒక్కసారి ఆలోచించండి మనకి ఒంట్లో బాగోకపోతే చుట్టుపక్కలెవారు లేకపోతే అది ఎంత బాధాకరం.పెద్దవాళ్ళకి చాదస్తం వుంటుంది.మనది చిన్నవయసు. కొంచెం సహనం వుంటే ఈ సమస్యకి కొంత పరిష్కారం వుంటుంది. అదే సమయం లో పెద్దవాళ్ళు కూడా ప్రతి విషయం లో కలుగ చేసుకోకుండా కొంత వరుకు భార్య భర్తలకి వారి సంసారానికి నిర్ణయాలు తీసుకునే హక్కు వారికీ ఇవ్వాలి.చెప్పడం సులువు కాని ఆచరణలో కష్టం అనొచ్చుకాని ప్రయతనమేమి లేకుండా వేరుగా ఉండడమేసమస్యకు పరిష్కారం అనడం తప్పు తప్పని పరిస్థితుల్లొ ఐతే తప్ప .

Unknown said...

ante mee vayasu lessthan 35 years annamata. okavela mee vayassu above 50 ite thoughts verela untai

కత పవన్ said...

నాకు ఈ వీషయాల గురించి పేద్దగా తెలియదు అయితే నాకు మాత్రం మా అమ్మనాన్న లంటే ఇష్టం ..పేళ్ళి తల్లితండ్రుల ఇష్టం.. బార్య కన్న తల్లితండ్రులకే ప్రాధాన్యం ఇవ్వాలని నా ఉద్దేశం..పేళ్ళి అయిన తరువాత కుడా నేను అలాగే ఉండాలను కుంటున్నాను

Truely said...

ఆవేదన గారు
చాల చక్కగా రాసారు. మీ సలహా చాల బాగుంది నేటి యువతరానికి . పెద్దవాళ్ళు
వాళ్ళ అంతట వాళ్ళు వ్రుదాస్రమం లో చేరాలని మీ పిలుపు కి జోహారులు.
మీ తల్లి తండ్రులు నిజాం గా అల వ్రుద్దస్రమం లో చేరితే ఎలా వుంటుందో వుహించు కొండి.
లేక పొతే మీ పిల్లలు కూడా మీలాగే అనుకుంటారు.

aavedana said...

స్వాతి మాధవ్ గారు ,
స్రిక్ గారు ,
మద్య్ గారు ,
అందరి కి , కలిసి కొట్టుకుంటూ వుండండి , విడి విడి గా సుఖంగా వుండకండి అని చెబితే నచ్చదేమో . కాని కొంచం ఆలోచించండి . ఏది సబబో మీకే అర్ధం అవుతుంది . అమ్మ అంటే పడ్డట్టు , అత్త అంటే పడతారా ?

# పవన్ గారు ,
మీ కాబోయే భార్యను తలుచుకుంటే జాలి వేస్తోంది .

swathi said...

ade manishi mida adharpadi vuntundi. mana kontha prayatnam anedi vundali.vidiga vundali anukuni kapuraniki enduku velladam . ade ame intlo ala vuhisthunda?samasyani velinanahtavaruku edurkovali ,taggataniki prayathinchali,paripokudadu.