Sunday, July 11, 2010

ఆడ మగ మధ్య స్నేహం

ఆడ మగ మధ్య స్నేహం చేస్తే జనాలు ఎందుకు వింత గా చెప్పుకుంటారు ? ఏం ? ఆడ మగ మధ్య స్నేహం వుండకూడదా ? అన్ని స్నేహాలకు ఒకటే అర్ధమా ? స్నేహానికీ కూడా హద్దులు పరిమితులు వున్నాయా ? అంటే వున్నాయనే చెప్పొచ్చు . కాలేజీలో , స్కూల్స్ లలో స్నేహం అంతవరకే వుండాలి . మాది పవిత్ర స్నేహం , మా మధ్య స్నేహం తప్ప ఏ అలోచనలు లేవంటే మన సమాజం హర్షించదు . మన పూర్వీకులు ఒక వయసు వచ్చిన ఆడపిల్లలని , తండ్రైనా , సోదరుడైనా దగ్గరకు తీసుకోవటానిని ఒప్పుకోలేదు . ఒక హద్దులోనే వుంచేవారు . కాదని మీద మీద పడుతున్న ఈ రోజులలో , పేపర్లో రోజూ , ఏదో ఒక చోట తండ్రి , కూతురి మీద అత్యాచారం చేసే ప్రయత్నం చేసాడని చదువుతునేవున్నాము .

ఈ మద్య మాకు తెలిసిన వారి అమ్మాయి ఒక అబ్బాయి తో తిరగటము చూసి , ఇంట్లో వాళ్ళూ కట్టడి చేసారు . ఆ అమ్మాయి , మాది స్నేహమే , ప్రేమ కాదు అని గొడవ చేసింది . ఐనా తండ్రి వినకుండా , ఆ అమ్మాయిన్ వేరే వూరు , తమ్ముడి దగ్గరకు పంపించి అక్కడ చదివిస్తున్నారు . ఆ అమ్మాయి తల్లితండ్రుల మీద ద్వేషం పెంచుకొని , వారు కాల్ చేసినా మాట్లాడదు . అక్కడికి వెళ్ళినా బయటకు కూడా రాదు . వారి మీద పగ పెంచుకున్నదే కాని వారు చేసిన మంచిని గ్రహించలేక పోతోంది . మన తల్లితండ్రులు , తోడబుట్టిన వారు తప్ప మన మంచిని కోరేది ఎవరు ?

ఇంకో చోట , 60 సంవత్స్రాలావిడ కు 20 సంవత్సరాల అబ్బాయి ఫ్రెండ్ . ఇద్దరూ కలిసి సినిమాలకు , ఆర్ట్ ఎక్జిబిషన్స్ కు వెళుతుంటారు . చిత్ర కళ నేర్చుకునే చోట ఫ్రెండ్స్ అయ్యారుట . మా అబ్బాయి కన్నా చిన్నవాడు అతని తో నాకు సంభంధం అంటగడుతారు ఏమి పాడు లోకం అని తిట్టిపోస్తుంది . ఆమెకూ ఇద్దరు అబ్బాయిలు , ఒక అమ్మాయి వున్నారు . మరి వాళ్ళ తో వెళ్ళ వచ్చుకదా సినిమాకి ? వాళ్ళు బిజీ అంటుంది . అంతే కాని రోజూ ఆ అబ్బాయి తో గంటల తరబడి మాటలు , సినిమాలకు , షికార్లకు చెక్కర్లూ చూసేవారికి ఎంత ఎబ్బెట్టుగా వుంటుందో గ్రహించుకోదు . మీ ఇద్దరికీ అంత మాటలు ఏముంటాయి అంటే ఏదో అడ్డం గా వాదిస్తుంది .మరి వాళ్ళాయన వారి పవిత్ర స్నేహాన్ని అర్ధం చేసుకున్నాడేమో తెలీదు .

కయ్యానికైనా , వియ్యానికైనా సరి జోడు వుండాలంటారు . అలాగే స్నేహానికి కూడా . సరి సమాన వయసు వారిలో నూ , ఏ జండర్ వారికి ఆ జండర్ వారి తోనూ వుంటేనే శోభిస్తుంది . లేకపోతే ఏదో వొక రోజు అది బెడిసి కొడుతుంది . సమాజము కన్నా ముందు , వయసు , వంటరి తనమే కొంపముంచుతుంది . అది అర్ధం చేసుకొని పెద్దల మాట వింటే మంచిది .

Monday, June 28, 2010

హైదరాబాద్ వెలిగి పోతోంది

వేసవి సెలవల్లో పిల్లలు హైదరాబాద్ చూద్దామంటే తీసుకెళ్ళాము . అదేమిటో సినిమాలలో చూపించే హీరో , హీరోయిన్ల ను మించి పోయారు , హైదరాబాదీ అమ్మాయిలు , అబ్బాయిలు . ఏ ప్రదేశానికి వెళ్ళినా ఒకరిమీద ఒకరు పడి పోతూ కనిపించారు . ముందు ఏదైనా సినిమా షూటింగేమో అనుకున్నాము . కాదు . మచ్చుకకి కొన్ని సంఘటనలు ;

ఓ స్కూటర్ మీద అమ్మాయి , మూతి ముడుచుకొని కూర్చొని వుంది . అబ్బాయేమో , అమ్మాయి తల నిమురుతూ , ముద్దు చేస్తూ , నోట్లో చాట్ పెడుతున్నాడు .

యోగీ బేర్ పార్క్ నుండి బయటకు రాగానే మా పిల్లలు నోరెళ్ళ బెట్టి , విచిత్రం గా చూస్తున్నారు . ఏమిటా అని చూస్తే ఓ అబ్బాయి బైక్ డ్రైవ్ చేస్తూ , వెనకకి తిరిగి అమ్మాయి పెదాలను ముద్దాడుతున్నాడు .

ఇహ సంజీవయ్య పార్క్ కెళుతే , చుట్టూ మనుషులున్నా , ఒకరి వళ్ళో వొకరు వాలి పోయి , వెకిలి చేస్టలు చేస్తున్నారు .

అంతేనా ఏ ప్రదేశం చూద్దామని వెళ్ళినా అన్ని చోట్లా ఎక్కువ తక్కువ గా ఇదేతంతు . ఈ బహిరంగ రొమాన్స్ ఏమిటో ? కనీసం అమ్మాయిలకైనా ఇంట్లో వాళ్ళకు తెలుస్తుందని భయం లేదా ? మరీ ఇంత బరి తెగించి పోయారా ? బాబోయ్ ఇదేమి హైదరాబాదు రా దేవుడా ?

Wednesday, May 19, 2010

చిన్ని కన్నా

నా చిన్ని కన్నయ్యా ,
నన్ను వదిలేసి వెళ్ళకు అన్నావు . నేను వినకుండా వదిలేసి వచ్చేసాను .
నా మీద కోపమా తండ్రీ ?
అసలు నిన్ను వదిలి నేనెలా జీవిస్తున్నానురా ? అసలు ఇదీ ఒక జీవిత మేనా ?
బుజ్జి కన్నా ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావురా .
అన్నం తిందామని కూర్చుంటే , అన్నానికి మారాము చేసే నీ ముద్దు మోమే కని పిస్తొంది . ముద్ద నొటికి దిగటం లేదు .
నిదుర పోదామంటే , నాకు కథ చెప్పకుండా పడుకుంటున్నావా అని అలిగే నీ చిన్నారి బుంగమూతి గుర్తొచ్చి నిదురే రావటము లేదు .
నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ , నా మెడ చుట్టూ చేతులు వేసి , నా బుగ్గ మీద నువ్వు పెట్టే బంగారం ముద్దును ఎలా మరచి పోనురా ?
కనీసం నువ్విచ్చిన నీ ఫొటో చూద్దామన్నా నీరు నిండిన నా కంటికి కనిపించవే !
నీకు నా బాధ ఎలా చెప్పను రా ?
ఒక్కసారి నిన్ను నా హృదయానికి హత్తుకోవాలని తపించి పోతున్నానురా ,
నిస్సహాయురాలైన ఈ అమ్మ కాని అమ్మను శపించకురా తండ్రి .
నీకోసం పరితపించే ఈ అమ్మ కాని అమ్మను క్షమించరా కన్నా !!

Tuesday, January 19, 2010

అత్తా కోడలు

యుగయుగాలుగా ఈ అత్తా కోడళ్ళ గొడవలు వున్నాయి . యుగాలసంగతి సరే మన ప్రియతమ నాయకురాలు ఇందిరా గాంధీ కూడా చిన్న కోడలుని , ఇంట్లో నుండి వెళ్ళ గొట్టింది కదా ? ఈ మధ్య జి టి వీ లో నాలుగు వారాలుగా ప్రజావేదికలో , పరచూరి ఆధ్వర్యము లో అత్తా కోడళ్ళ చర్చ బహు రసవత్తరం గా సాగింది . ఎవరి వాదనలను వారు వినిపించారు . సరే ఎవరి వాదన వారికి కరెక్ట్ నే కదా . చివరికి పరుచూరి ఓ పిట్ట కథ చెప్పారు .

కురుక్షేత్ర సమరం జరిగేటప్పుడు అర్జునుడు , శ్రీకృష్ణుని తో కలిసి వేరే పక్కయుద్దం చేసివస్తాడు . అప్పటికి ధర్మరాజు , తదితరులకు చాలా దెబ్బలు తగులుతాయి . ధర్మజుడు , అర్జునుని చూడగానే , మమ్మలిని కాపాడలేని నీకు ఈ గాంఢివం ఎందుకు అవతల పారేయ్ అంటాడు . తన గాండీవాన్ని ఎవరూఎమైనా అంటే వారిని చంపేయటము అర్జునుని నియమం . అందుకే ఒరలోనుండి కత్తి తీస్తాడు . వెంటనే శ్రీకృష్ణుడు ఆగు బావా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు . నా గాండీవాన్ని అవమానించినవారిని చంపేయటము నా నియమము కదా అందుకే అన్నయ్యను చంపబోతున్నాను అంటాడు . ఐతే చంపేముందు మీ అన్నను , నీఇష్టం వచ్చినట్లుగా తిట్టు అంటాడు కృష్ణుడు . పిచ్చి పిచ్చిగా ధర్మజుని తిట్టి , చంపబోతాడు అర్జునుడు . వెంటనే శ్రీకృష్ణుడు ఇంకా ఎందుకు చంపటము ? అన్న , తండ్రి అంతటి వాడు . తండ్రిని తిడుతే చంపినట్లుగానే , కాబట్టి ఇంకా వేరుగా చంపక్కరలేదు అంటాడు . కాని మళ్ళీ అర్జునుడు ఒరలోనుండి కత్తి తీస్తాడు . మళ్ళీ ఏమైంది అంటాడు కృష్ణుడు . అన్నయ్యను చంపాక నేనెందుకు బతకటము అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటాడు అర్జునుడు . ఐతే , నిన్ను నువ్వు పొగుడుకో అంటాడు శ్రీకృష్ణుడు . అర్జునుడు పొంగిపోయి తనను తాను తెగ పొగుడేసుకొని , కత్తి తీస్తాడు . ఇంకా ఎందుకు ఆత్మహత్య చేసుకోవటము ? నిన్ను నువ్వు పొగుడుకోవటము ఆత్మహత్యాసమానమే , కనుక నువ్విక ఆత్మహత్య చేసుకోనవసరములేదు అని శ్రీకృష్ణుడు చిద్విలాసం గా నవ్వుతాడు ! కృష్ణుడు మేధావి కనుక ఆ సమస్యను అలా పరిష్కరించాడు . అలాగే మగవాడు , భర్త , తండ్రి అలా పరిష్కారించాలి . అత్తా కోడళ్ళ సమస్యను పరిష్కరించవలిసింది పురుషొత్తముడైన మగవాడే . అప్పుడే కుటుంబము లో కలతలు లేకుండా ప్రశాంతముగా వుంటుంది అని ముగించారు పరుచూరి .

నిజముగా ప్రపంచములో అంతటి పురుషోత్తములు ఎవరైనా వున్నారా ? ఇటు పెళ్ళం కొంగు పట్టుకునేవాడో , లేదా తల్లిచాటు బిడ్డడో తప్ప , ఇద్దరినీ బాలెన్స్ చేసవాడిని నేనైతే ఇంతవరకు చూడలేదు . బలవంతుడు , బలహీనుని అణచటము అన్నది ఎక్కడైనా వున్నది . అది ఎవరైనా కావచ్చు .

అసలు ఇంత గొడవేందుకు ? ఏదైనా గొడవ మొదలైతుంది , ఇద్దరికీ పడటము లేదు అనుకున్నప్పుడు , ఆ పురుషోత్తముడు పెళ్ళాన్ని తీసుకొని హాయిగా వేరు కాపురము పెడితే సరిపోతుంది కదా ? కొట్టుకుంటూ కలిసి వుండి బ్రతుకుని నరకము చేసుకునే బదులు విడివిడి గా వుండి అప్పుడప్పుడు కలుసుకుంటూ సంతోషముగా వుండవచ్చు . చివరి రోజులలో కొడుకులు చూసుకుంటారన్నది వుట్టిమాట . బాద్యతలు తీర్చుకున్నాక , పెద్ద దంపతులు హాయిగా వారి దారి వారు చూసుకోవటము మేలు . అప్పటికైనా ఎంజాయ్ చేయటము నేర్చుకుంటే మంచిది . పిల్లలు , పంపినప్పుడు ఏడ్చుకుంటూ , ఆశ్రమానికి వెళ్ళేబదులు , ఓపికలేని రోజులలో , డబ్బువుంటే మనిషిని పెట్టుకొని చేయించుకోవటమో , లేదా సొంతంగానే ఆశ్రములో చేరటము మేలు కదా .

Wednesday, January 6, 2010

డాన్స్ బేబీ డాన్స్

లలితకళలని ప్రోత్సహించటము మంచి ఉద్దేశమే . బాలసుబ్రమణ్యం పాడుతా తీయగా మొదలు పెట్టినప్పుడు , ఆంధ్రదేశం లో ఆబాలగోపాలం పాటల పట్ల , ఆ ప్రోగ్రాం పట్ల ఆకర్శితు లయ్యారు . ఏ ఇంట చూసినా , ఏ నోట విన్నా , ఆ కార్యక్రమము పేరే మారు మోగుతుండేది . అది మంచి శుభపరిణామం . అందులో యస్. పి గారు తెలుగు పద్యాల గురించి కూడా వివరించేవారు . అటువంటి కార్యక్రమములు పలు టివి చానల్స్ వారు పోటీగా నిర్మించినా , పిల్లలో , పెద్దలలో పాటల పట్ల మక్కువ ఏర్పడి ,అందరికీ సంగీతం నేర్చుకోవాలనే తపన కలిగి , ఆ పోటీ ఆరోగ్యకరం గానే వున్నది .

అలాగే నాట్య కార్యక్రమములు మొదలయ్యాయి . అందులో సప్తగిరి చానల్ లో ప్రభ నిర్వహిస్తున్న ,అందెల రవళి నాట్య కార్యక్రమం చూడతగినది .ఇక మిగిలిన డాన్స్ బేబీ డాన్స్ , ఢీ , ఆటా మొదలైనవి , మొదట్లో బాగున్నా రాను రాను వెర్రితలలు వేస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చేస్తున్న డాన్స్ ఏమిటో తెలీకుండానే , పొట్టి పొటి గౌన్లు వేసుకొని గెంతటము , ఓపక్క ఏవగింపు , ఇంకో పక్క బాధ కలుగు తోంది . తల్లితండ్రులు వాటిని ప్రోత్సహించటము తెలిసి చేస్తున్నారా ? తెలీక చేస్తున్నారా అర్ధం కావటము లేదు .ఇక పెద్ద పిల్లల డాన్స్ కి వస్తే , వాళ్ళ తోపాటు , ఓ మాస్టరూ , వాళ్ళు చేసే డాన్స్ ను వెక్కిరించే జడ్జిలు ., గొడవ పడే ప్రేక్షకులు , అసలిదంతా ఏమిటి ? అసలు అవి డాన్స్ లేనా , వాళ్ళసలు న్యాయ నిర్ణయకులేనా ? ఏ చానల్ చూసినా ఇవే పిచ్చి గంతులు . వాళ్ళ ఏడుపులు !!!!

చివరకు ఇది ఎంతాదాకా వెళ్ళిందంటే , ఓ చిన్నారి పాప ఆత్మహత్య దాకా . 11 ఏళ్ళ పాప నేహ , డాన్స్ ఎకాడమీ లో సిక్షణ పొంది , మూడు రియాల్టీ షో లలో పాల్గొందట .ఇక డాన్స్ చాలు , చదువు మీద దృష్టి పెట్టమని తలితండ్రులు హెచ్చరించినందుకు , ఇంట్లో ఎవరూ లేని సమయము లో చున్నీ తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది . ఇది ముంబై లోని డోంబివిల్లీ లో జరిగినది . ఇది ఎంత బాధాకరమైన సంఘటన ! దీనికి ఎవరిని నిందించాలి ?

Sunday, January 3, 2010

కలిసివుండాలా ? విడిపోవాలా ?

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి . అందులో పని చేసి సంపాదించేవాడు ఒకరైతే , సోమరిపోతుగా కూర్చునేవాడొకడు . ఐనా కుటుంబపెద్ద చెప్పిన్నట్టుగా అందరూ వినేవారు . ఒక తాటి పై నడిచేవారు . ఏమైనా సంపాదించేవాడికి , వాడి బార్య కు వున్న విలువ , సంపాదన లేనివాడి కి , వాడి భార్య కు లేదు . పాపం వాడి భార్యకు ఇంట్లో ఎంత చాకిరీ చేసినా గుర్తింపు లేదు . అలాగే గౌర్నమెంట్ నౌకరీ వున్నవాడి విలువ వేరు .కాని అదేమిటో ఇంట్లో పని చేస్తూ ఉండే వాల్లకు ఎప్పుడూ గుర్తింపు లేదు . . బయట ఉద్యోగము చేసేవాడు ఏదో తవ్వి తలకెత్తుతాడని , చివరకు తల్లి తండ్రి కూడా వాళ్ళనే నెత్తినే పెట్టుకునేవారు . ఆ విభేధాలు చూపేవారు . దాని తో వాడు , వాడి పెళ్ళాం నెత్తి కెక్కి , విడిపోదామనుకునే వరకు వచ్చింది , కొన్ని సంవత్సరాల తరువాత . సరే వేరే గతి లేక తండ్రి కూడ ఆస్తి పంచి ఇచ్చి , పెద్దకొదుకు దగ్గర సెట్టిల్ ఐపోవటము , ఆ తరువాత , విడిపోదామనుకు న్న కొడుకు తప్పు తెలుసుకొని , పెళ్ళాన్ని నాలుగు తన్ని , తండ్రి కాళ్ళ మీద పడి కలిసి పోవటము పాత సినిమా కతలు . ఆ తరువాత కాలము లో , కొన్ని రోజులు సంఘర్షణ పడి , విడి పోయి ఎవరికి వారుగా వుండి , అప్పుడప్పుడు కలుసుకుంటూ , కష్ట సమయాలలో ఒకరినొకరు ఆదుకుంటూ, కలిసి వుండటము నిన్నటి సినిమా కథలు . మరి నేటి సినిమా కథలు ఏమిటి ? ఏమో ?

మన నేటి భారతం కూడా అలానే వుంది . అందరూ కలిసివున్నారు . విడి రాజ్యా లైనారు . చివరకు విదేశీయులను కాడా ఆహ్వానించారు .వాడు నెత్తికెక్కుత్తే కలిసి కట్టుగా వెళ్ళగొట్టారు ,కాని చివరకు ఏం చేసారు , ఎవడో తురకోడు అడిగాడని వాడికి హిందూదేశం లోనుండి కొంత భాగాన్ని ఉదారం గా పంచేసారు . ఇపుడేమో ఉన్నదాని కోసం కొట్టుకు చస్త్తున్నారు . మాది అంటే మాది అని , విడి పోదామని ఏవో కోరికలు . కలిసి వుంటే బావుకునేదేమి లేదు . విడి పోతే నష్ట పోయేదేమీ లేదు !!!

ఈ రోజు పెద్దలంతా డిల్లీ లో మీటింగ్ పెడుతారట ! మరి ఎలా పంచుకుంటారో ? అప్పులు , ఆస్తులు చెరిసగం చేస్తారా , లేక అప్పొకడికి , ఆస్తొకడి ఇస్తారా , రెండు రాస్ట్రాలు చేస్తారా , నాలుగు చెస్తారా , చివరకు నెత్తిన గుడ్డేసుకొని వస్తారా అన్ని ప్రశ్నలే . ఇప్పటికే రాస్ట్రం ఆరని కాష్టం ఐపోతోంది . సామాన్యుడు తల్లడిల్లి పోతున్నాడు . ఆర్ .టి .సి కి 200 కోట్ల పైన నష్టం అట . 100 ప్రాణాలు గాలి లో కలిసి పోయాయట . ఇవి అధికారిక లెక్కలు . అనధికారికం గా ఎంత నష్టమో , ఈ నష్టం అంతా బడుగు జీవి నెత్తినే రుద్దుతారు . ఈ నేతల పంచుకోవటాలు తేలేదెప్పుడో , జనజీవనం కుదుటపడే దెప్పుడో , ఆ దేవ దేవుడి కూడా తెలీదేమో .

Wednesday, December 9, 2009

తెలంగాణా నా ఎవరి కోసం ?

ఒక తాగుబోతు , ఒక తిరుగుబోతు , ఎన్నికలలో ఓటు తెచ్చుకోలేక , తెరమరుగు అవుతున్నాననే అని ఒక చీప్ ట్రిక్ ప్లే చేస్తే , తెలంగాణా ఇచ్చేస్తారా ? ప్రమాదపు అంచులలో వున్నవాడు , వెంటనే , ఐ . సి . యు నుండి వార్ద్కి ఎట్లా మార్చారు ? ప్రతి రోజు ఎంతొ మంది చస్తున్నారు ? ఈ ఉద్యమము పేరు తో అమాయకులను చంపారు . ప్రజా ఆస్తిని ద్వంసం చేసారు . ఆ విద్వంసకుడు మాత్రము , దొంగ కన్నీరు కారుస్తూ , ఇక ముందు , ముందు తెలంగాణా ని ఇంకెంత దోచుకోవాలా అని ప్లాన్ చేస్తున్నాడు . తరతరాలుగా తెలంగాణాని ఎలావచ్చు .
ఇదే చేత్తో హైదరాబాద్ ని తురకోల్లకి , హిమాలయాలని చైనా వాడికి పంచేయ్ సోనియమ్మా ! నీ సోమ్మేమి కాదుగా !