Wednesday, January 6, 2010

డాన్స్ బేబీ డాన్స్

లలితకళలని ప్రోత్సహించటము మంచి ఉద్దేశమే . బాలసుబ్రమణ్యం పాడుతా తీయగా మొదలు పెట్టినప్పుడు , ఆంధ్రదేశం లో ఆబాలగోపాలం పాటల పట్ల , ఆ ప్రోగ్రాం పట్ల ఆకర్శితు లయ్యారు . ఏ ఇంట చూసినా , ఏ నోట విన్నా , ఆ కార్యక్రమము పేరే మారు మోగుతుండేది . అది మంచి శుభపరిణామం . అందులో యస్. పి గారు తెలుగు పద్యాల గురించి కూడా వివరించేవారు . అటువంటి కార్యక్రమములు పలు టివి చానల్స్ వారు పోటీగా నిర్మించినా , పిల్లలో , పెద్దలలో పాటల పట్ల మక్కువ ఏర్పడి ,అందరికీ సంగీతం నేర్చుకోవాలనే తపన కలిగి , ఆ పోటీ ఆరోగ్యకరం గానే వున్నది .

అలాగే నాట్య కార్యక్రమములు మొదలయ్యాయి . అందులో సప్తగిరి చానల్ లో ప్రభ నిర్వహిస్తున్న ,అందెల రవళి నాట్య కార్యక్రమం చూడతగినది .ఇక మిగిలిన డాన్స్ బేబీ డాన్స్ , ఢీ , ఆటా మొదలైనవి , మొదట్లో బాగున్నా రాను రాను వెర్రితలలు వేస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చేస్తున్న డాన్స్ ఏమిటో తెలీకుండానే , పొట్టి పొటి గౌన్లు వేసుకొని గెంతటము , ఓపక్క ఏవగింపు , ఇంకో పక్క బాధ కలుగు తోంది . తల్లితండ్రులు వాటిని ప్రోత్సహించటము తెలిసి చేస్తున్నారా ? తెలీక చేస్తున్నారా అర్ధం కావటము లేదు .ఇక పెద్ద పిల్లల డాన్స్ కి వస్తే , వాళ్ళ తోపాటు , ఓ మాస్టరూ , వాళ్ళు చేసే డాన్స్ ను వెక్కిరించే జడ్జిలు ., గొడవ పడే ప్రేక్షకులు , అసలిదంతా ఏమిటి ? అసలు అవి డాన్స్ లేనా , వాళ్ళసలు న్యాయ నిర్ణయకులేనా ? ఏ చానల్ చూసినా ఇవే పిచ్చి గంతులు . వాళ్ళ ఏడుపులు !!!!

చివరకు ఇది ఎంతాదాకా వెళ్ళిందంటే , ఓ చిన్నారి పాప ఆత్మహత్య దాకా . 11 ఏళ్ళ పాప నేహ , డాన్స్ ఎకాడమీ లో సిక్షణ పొంది , మూడు రియాల్టీ షో లలో పాల్గొందట .ఇక డాన్స్ చాలు , చదువు మీద దృష్టి పెట్టమని తలితండ్రులు హెచ్చరించినందుకు , ఇంట్లో ఎవరూ లేని సమయము లో చున్నీ తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది . ఇది ముంబై లోని డోంబివిల్లీ లో జరిగినది . ఇది ఎంత బాధాకరమైన సంఘటన ! దీనికి ఎవరిని నిందించాలి ?

2 comments:

శిశిర said...

అయ్యో...ఇలాంటి అఘాయిత్యాలు కూడా జరుగుతున్నాయా వీటివల్ల?

ప్రేరణ... said...

నిజమే నేను విన్నానండి, చాలా భాధాకరమైన విషయం:(