Sunday, January 3, 2010

కలిసివుండాలా ? విడిపోవాలా ?

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి . అందులో పని చేసి సంపాదించేవాడు ఒకరైతే , సోమరిపోతుగా కూర్చునేవాడొకడు . ఐనా కుటుంబపెద్ద చెప్పిన్నట్టుగా అందరూ వినేవారు . ఒక తాటి పై నడిచేవారు . ఏమైనా సంపాదించేవాడికి , వాడి బార్య కు వున్న విలువ , సంపాదన లేనివాడి కి , వాడి భార్య కు లేదు . పాపం వాడి భార్యకు ఇంట్లో ఎంత చాకిరీ చేసినా గుర్తింపు లేదు . అలాగే గౌర్నమెంట్ నౌకరీ వున్నవాడి విలువ వేరు .కాని అదేమిటో ఇంట్లో పని చేస్తూ ఉండే వాల్లకు ఎప్పుడూ గుర్తింపు లేదు . . బయట ఉద్యోగము చేసేవాడు ఏదో తవ్వి తలకెత్తుతాడని , చివరకు తల్లి తండ్రి కూడా వాళ్ళనే నెత్తినే పెట్టుకునేవారు . ఆ విభేధాలు చూపేవారు . దాని తో వాడు , వాడి పెళ్ళాం నెత్తి కెక్కి , విడిపోదామనుకునే వరకు వచ్చింది , కొన్ని సంవత్సరాల తరువాత . సరే వేరే గతి లేక తండ్రి కూడ ఆస్తి పంచి ఇచ్చి , పెద్దకొదుకు దగ్గర సెట్టిల్ ఐపోవటము , ఆ తరువాత , విడిపోదామనుకు న్న కొడుకు తప్పు తెలుసుకొని , పెళ్ళాన్ని నాలుగు తన్ని , తండ్రి కాళ్ళ మీద పడి కలిసి పోవటము పాత సినిమా కతలు . ఆ తరువాత కాలము లో , కొన్ని రోజులు సంఘర్షణ పడి , విడి పోయి ఎవరికి వారుగా వుండి , అప్పుడప్పుడు కలుసుకుంటూ , కష్ట సమయాలలో ఒకరినొకరు ఆదుకుంటూ, కలిసి వుండటము నిన్నటి సినిమా కథలు . మరి నేటి సినిమా కథలు ఏమిటి ? ఏమో ?

మన నేటి భారతం కూడా అలానే వుంది . అందరూ కలిసివున్నారు . విడి రాజ్యా లైనారు . చివరకు విదేశీయులను కాడా ఆహ్వానించారు .వాడు నెత్తికెక్కుత్తే కలిసి కట్టుగా వెళ్ళగొట్టారు ,కాని చివరకు ఏం చేసారు , ఎవడో తురకోడు అడిగాడని వాడికి హిందూదేశం లోనుండి కొంత భాగాన్ని ఉదారం గా పంచేసారు . ఇపుడేమో ఉన్నదాని కోసం కొట్టుకు చస్త్తున్నారు . మాది అంటే మాది అని , విడి పోదామని ఏవో కోరికలు . కలిసి వుంటే బావుకునేదేమి లేదు . విడి పోతే నష్ట పోయేదేమీ లేదు !!!

ఈ రోజు పెద్దలంతా డిల్లీ లో మీటింగ్ పెడుతారట ! మరి ఎలా పంచుకుంటారో ? అప్పులు , ఆస్తులు చెరిసగం చేస్తారా , లేక అప్పొకడికి , ఆస్తొకడి ఇస్తారా , రెండు రాస్ట్రాలు చేస్తారా , నాలుగు చెస్తారా , చివరకు నెత్తిన గుడ్డేసుకొని వస్తారా అన్ని ప్రశ్నలే . ఇప్పటికే రాస్ట్రం ఆరని కాష్టం ఐపోతోంది . సామాన్యుడు తల్లడిల్లి పోతున్నాడు . ఆర్ .టి .సి కి 200 కోట్ల పైన నష్టం అట . 100 ప్రాణాలు గాలి లో కలిసి పోయాయట . ఇవి అధికారిక లెక్కలు . అనధికారికం గా ఎంత నష్టమో , ఈ నష్టం అంతా బడుగు జీవి నెత్తినే రుద్దుతారు . ఈ నేతల పంచుకోవటాలు తేలేదెప్పుడో , జనజీవనం కుదుటపడే దెప్పుడో , ఆ దేవ దేవుడి కూడా తెలీదేమో .

No comments: