Wednesday, December 9, 2009

తెలంగాణా నా ఎవరి కోసం ?

ఒక తాగుబోతు , ఒక తిరుగుబోతు , ఎన్నికలలో ఓటు తెచ్చుకోలేక , తెరమరుగు అవుతున్నాననే అని ఒక చీప్ ట్రిక్ ప్లే చేస్తే , తెలంగాణా ఇచ్చేస్తారా ? ప్రమాదపు అంచులలో వున్నవాడు , వెంటనే , ఐ . సి . యు నుండి వార్ద్కి ఎట్లా మార్చారు ? ప్రతి రోజు ఎంతొ మంది చస్తున్నారు ? ఈ ఉద్యమము పేరు తో అమాయకులను చంపారు . ప్రజా ఆస్తిని ద్వంసం చేసారు . ఆ విద్వంసకుడు మాత్రము , దొంగ కన్నీరు కారుస్తూ , ఇక ముందు , ముందు తెలంగాణా ని ఇంకెంత దోచుకోవాలా అని ప్లాన్ చేస్తున్నాడు . తరతరాలుగా తెలంగాణాని ఎలావచ్చు .
ఇదే చేత్తో హైదరాబాద్ ని తురకోల్లకి , హిమాలయాలని చైనా వాడికి పంచేయ్ సోనియమ్మా ! నీ సోమ్మేమి కాదుగా !

Thursday, November 12, 2009

పదవివ్యామోహము

జగన్ ధోరణి చూస్తుంటే పదవి కోసం తండ్రి ని తానె తప్పించాడే మో అనిపిస్తోంది . ఫ్ఫాక్ష్నిష్టులకు తన పర అనే భేదం వుందడట . ఇలాటి కతలు సినిమాలలో చూస్తూనే వున్నాము . వింటూనే వున్నాము . లేకపోతె ఏంత ధైర్యం లేకపోతె నేను తప్పక సి .యమ్ అవుతానంటాడు ? మొత్తము కుంటుంబము సోనియాని కలిసివచ్చారట ! ఏమిటో ఈ పదవీ వ్యామోహాలు .

Saturday, June 27, 2009

బంధీ



ఓ చిలుకా రా చిలుకా ఎందుకమ్మా నీకీ చెర
అయ్యో విరిచేసారే నీ రెక్కలు
ఏమి చేసావని నీకీ శిక్ష
తన పొట్ట కోసం కొట్టారే నీ పొట్ట
కోల్పోయావే నీ స్వేచ్చ
ఏ జన్మ లో ఏ పాపం చేసావో
ఈ జన్మ లో భందీ వయ్యావు పంజరాన.

Monday, June 8, 2009

అత్తగారిజీవిత ఖైదు

ఈ మద్య అత్తగార్ల ఘోష ఎక్కువయింది.ఒకప్పుదు కోడళ్ళు ఇబ్బంది పదితే ఇప్పుడు అత్తగార్ల వంతు వచ్చింది.నేను వుద్యొగము చేసినప్పుడు నాకు ఎవరూ సహకరించ లేదు,కోడలి కి సాయము చేద్దాం,నాకు చాతనైనంత సహకరిద్దాం అనుకోవతాకు,పైగా ముందు తరం వాళ్ళు కావటము వలన భర్త మాట కాదన్ లేక పోవతము, ఆ భర్త సమాజము కోసమో,కొడుకు మీద ప్రేమతోనో భార్య కి పురమాయించటము తో వాళ్ళను ఇబ్బందులలో పడవేస్తోంది.భర్తల సహకారము అప్పుడూ లేదు ,ఇప్పుడూ లేదు.కొడుకూ కొడలు ఎప్పుడు వస్తారో తెలీదు. వచ్చినా మన లోకం లో వుండరు.పిల్లలది ఒక్కక్కరిది ఒక్కో సమయము.ఉద్యోగ విరమన చేసి ,పిల్లల భధ్యత తీరింది హమ్మయ్య అనుకోవతాని కిలేదు.మళ్ళీ పిల్లలు,ఇల్లు,పనివాల్లు. అప్పుడు అత్తగరి సేవ ,ఇప్పుడు కొడలి సేవ .సాండ్విచ్ .జీవిత ఖైదు.

కోడలి సంగతి చూద్దామా అంటే కోడలు ,ఆమె తల్లి ప్రవర్తన మహా విచిత్రం.నేను నా అత్త దగ్గర కష్టాలు పడ్డాను నా కూతురు పడకూడదు అనుకోవటము లో తప్పు లేదు.అల్లాగే నా కూతురు పెద్ద పొజిషన్ కి వెళ్ళాలి,బాగా సంపాదించాలి అనుకోవటము లోను తప్పులేదు కాని అత్తగారి మీదికి ఎగదోయటమేమిటి?ఇంత చదివించింది అత్తగారికి సేవలు చేయటానికా అని డైలాగులేమితి?అల్లాంటప్పుడు కుతురునీ దగ్గరుంది చూసుకోవాలి.కాని చూడరు ఎందుకంటే వాళ్ళకి స్వాతంత్రం కావాలిగా!ఎంతైనా పెళ్ళైన ఆడపిల్ల అత్తవారింట్లో వుంది ఆవిద తో సేవలు చేయించుకోవటమే న్యాయం.

వారాని కి ఐదు రోజులు టార్గేట్ లను పూర్తి చేయటానికి గోల్ రీచ్ అవటానికే సరిపోతుంది.ఊపిరి తీసుకునే సమయమే వుండదు.మా కాఫ్ఫీ మేము తాగటా నికే టైం లేదు. ఇక అత్తాగారికేం ఇస్తాము?అని హైటెక్ కొడలు సమాదానము. మరి మిగిలిన రెండు రోజులూ?అల్సిన సరీరానికి విశ్రాంతి వద్ద? సరేనమ్మా అత్తమామల సంగతి సరే, మీరు మోసి కష్టపడి కని, చనుపాలిచ్చిన పిల్లల సంగతేమిటి?అప్పుడప్పుడు బొమ్మలతో ఆడు కున్నట్లు ఆడూకోని,వీకెంద్ లో మాల్ల్ కి తీసుకెల్లి షాప్పింగ్ చేస్తే అయిపోతుందా?స్చూల్ కి లక్షలు ఫీస్ కడుతున్నాము వాళ్ళదే బాద్యత ,తుషన్ తీచర్ కి వేలకు వేలు జీతాలిస్తున్నాము ,అత్తగారికి పని లేకుండా పనివాళ్ళను పెత్తాము ఇంకేంచేయాలి?

ఇంకేం వద్దు.మీరు కావలసినన్ని లక్షలు మూటగట్టుకోని,బోలెడ్డన్ని ప్రమోషన్లు పొంది, కేరియర్ పెంపొందించుకున్నాక అప్పుడు మీరెక్కివచ్చిన మెట్ల కింద నలిగి పోయిన వారిని చూసి సంతోషిస్థారో విచారిస్తారో మీ ఇస్టం.కాని ఒక సలహా కేరియర్ కావాలి అనుకున్నప్పుడు సంసార జంజాటం పెట్టుకో కుండా వుంటే మంచిది.

Thursday, June 4, 2009

తెలంగాణాపై ఓ.యు విద్యార్థుల ఆవేదన

అగ్రకుల నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమాలతో మాకు వనగూడింది ఏమిటి?మీ పిల్లలు విదేశాలలో వుంటే ప్రత్యేక తెలంగాణ రాస్ట్రం కోసముదళిత బహుజనులు బలికావాలా ...
అని 2ంద్ జూన్ ఆంద్ర జ్యొతి పపెర్ లో దుర్గం భాస్కర్ రీసర్చ్ స్కాలర్
శెట్టి ,తెలంగాణా ఉద్యమ కారుదు,
గాలి వినోద్ కుమర్,అస్సిస్టెంత్ ప్రొఫెసర్ మొదలైన వారు ఇంటర్ వ్యు ఇచ్చారు.
అంటె ఇన్ని సంవత్సరాలు నస్ట పోతె కాని ఆ సంగతి తెలీ లేదా?
1969 తెలంగాన ఉద్యమం లో 369 మందివిద్యార్ధులు అసువులు బాసారత.
ఈ రకముగా ఎంత మంది విద్యార్ధుల జీవితాలు నాసన ఈపోతున్నాయి?దీని కి కారణము ఏవరు?విద్యార్ధుల్లారా,ఒక్క నిమిషము ఆలోచించండి,మీ మీద ఏన్నొ అసలు పెట్టుకొని మీమ్మలిని ,మీ భవిస్యత్తును తీర్చి దిద్దాలని మీ తల్లి తంద్రులు మీ చదువు కోసము ఏంత పాటు పడుతున్నారు?
కడుపు కట్టుకొని మిమ్మలిని చదివిస్తే ఏదో బాగుపడతారని,తమని వుద్దరిస్త్తారని అనుకుంటారే కాని ఈ రకముగా కడుపులో చిచ్చు పెడతారని ఊహించరుగా !ఈ ఉద్యమాలు కడుపు నిండిన వారి కే కాని సామాన్య జనాని కి కాదు.
ఏ .సి కార్లలో జడ్ కటగిరి రక్షణ వలయములో వుండి ,ఏ.సి ఇళ్ళ లో బజ్జొని,బొజ్జ పెంచుకునే నాయకులు మిమ్మలిని ఏం వుద్దరిస్త్తారు?భారత స్వాతంత్ర వుద్యమము తరువాత బాగుపడింది ఏవరు?ఆ ఉద్యమము లో అసువులు బాసిన వారి కుటుంబాలు ఏమయ్యాయి?
కనీసము గాంధిజీ నైనా ,ఆయన జయంతి ,వర్ధంతి రోజున తప్ప మిగితా రోజులలో ఎంతమంది తలుచుకుంతున్నారు?
స్వాతంత్రము తరువాత బలపడింది నెహ్రూ కుటుంబము, తరతరాలు గా భారతదేశ పట్టాభిషెకం వారికే!తెలంగాణా ఉద్యమం తరువాత పట్టాభిషేకం చెన్నారెడ్డి కుటుంబానికే!ఇప్పుడు కే సి ఆర్ ,విజయశాంతికే గుర్తింపు.
అప్పుడు ఇప్పుడూ నష్త పోయేది మామూలు జనాభానే!ముఖ్యముగా విద్యార్దులే!
కులాలు మతాలు,రాష్ట్రాలు అంటు రెచ్చగొట్టి బప్పం గడుపుకునే దొంగ నాయకుల వలలో పది మీ జీవితాలను నాశనము చేసుకొని,మీ తల్లి తంద్రు ల కలలను నాశనము చేయకండి.మీవిలువైన సమయము వ్రుధా చేసుకుంటే ఆ తరువాత ఏంత విచారించి లాభము లేదు.అ రోజున ఏ రాజకీయ నాయకుడు మిమ్మలిని ఆదుకోడని అర్ధం చేసుకోండి.
ముందుగా మీ జీవితాని చక్క దిద్దుకోండి తరువాత దేశాన్ని వుద్దరిద్దురుగాని.అంతగా దేశానికి సేవచేయాలనుకుంటే మీ చదువు తరువాత సైన్యం లో చేరండి ,పొలీస్ లో చేరండి .అంతే కాని కుహానా రాజకీయుల నాయకుల చేతులలో మోసపోకండి.
కానీసము ఈ ఇంటర్వ్యులను చదివైనా నిజా నిజాలు తెలుసు కొండి.

Wednesday, May 27, 2009

అంతరంగాలు

ఈ మద్య టైం పాస్ కి సర్చ్ లు చెస్తుంతె తెలుగు బ్లగ్లు కనిపించాయి.నా అంతరంగం వెరె ఆలొచ్న లెకుదా రాసుకొవతానికి ఇదెదొ బనె వుందనిపించి బ్లాగ్ మొదలు చెసాను.కాని తెలుగు రాయతము కొంచము కస్తము గానె వుంది రాస్తు వుంతె వస్తుందెమొ.నా అలొచనలు పదుగురితొ పంచూకొవచ్చు.బానె వుంది