Monday, June 28, 2010

హైదరాబాద్ వెలిగి పోతోంది

వేసవి సెలవల్లో పిల్లలు హైదరాబాద్ చూద్దామంటే తీసుకెళ్ళాము . అదేమిటో సినిమాలలో చూపించే హీరో , హీరోయిన్ల ను మించి పోయారు , హైదరాబాదీ అమ్మాయిలు , అబ్బాయిలు . ఏ ప్రదేశానికి వెళ్ళినా ఒకరిమీద ఒకరు పడి పోతూ కనిపించారు . ముందు ఏదైనా సినిమా షూటింగేమో అనుకున్నాము . కాదు . మచ్చుకకి కొన్ని సంఘటనలు ;

ఓ స్కూటర్ మీద అమ్మాయి , మూతి ముడుచుకొని కూర్చొని వుంది . అబ్బాయేమో , అమ్మాయి తల నిమురుతూ , ముద్దు చేస్తూ , నోట్లో చాట్ పెడుతున్నాడు .

యోగీ బేర్ పార్క్ నుండి బయటకు రాగానే మా పిల్లలు నోరెళ్ళ బెట్టి , విచిత్రం గా చూస్తున్నారు . ఏమిటా అని చూస్తే ఓ అబ్బాయి బైక్ డ్రైవ్ చేస్తూ , వెనకకి తిరిగి అమ్మాయి పెదాలను ముద్దాడుతున్నాడు .

ఇహ సంజీవయ్య పార్క్ కెళుతే , చుట్టూ మనుషులున్నా , ఒకరి వళ్ళో వొకరు వాలి పోయి , వెకిలి చేస్టలు చేస్తున్నారు .

అంతేనా ఏ ప్రదేశం చూద్దామని వెళ్ళినా అన్ని చోట్లా ఎక్కువ తక్కువ గా ఇదేతంతు . ఈ బహిరంగ రొమాన్స్ ఏమిటో ? కనీసం అమ్మాయిలకైనా ఇంట్లో వాళ్ళకు తెలుస్తుందని భయం లేదా ? మరీ ఇంత బరి తెగించి పోయారా ? బాబోయ్ ఇదేమి హైదరాబాదు రా దేవుడా ?

5 comments:

KRISH said...

MEE OORU PO...

నాగప్రసాద్ said...

తప్పు వాళ్ళది కాదండి. అటువంటి వాళ్ళు ఉంటున్న ప్రదేశాల్లోకి వెళ్ళిన మీది తప్పు. :-)))

Ravi said...

PDA (Public Display of Affection) అని అంటారు దీన్ని. మీరన్నట్లు ప్రస్తుతం చాలా ఎక్కువౌతోంది. కేవలం హైదరాబాద్ లోనే కాదు సుమా అన్ని పేరొందిన నగరాల్లోనూ, నెమ్మదిగా పట్టణాల్లోకి కూడా విస్తరిస్తోంది. నాకైతే హైదరాబాద్ లో పట్టపగలే రోడ్డు వారగా(కొండాపూర్ టొయోటా షో రూమ్ ఎదురుగా) నిల్చును ముద్దు పెట్టుకుంటున్న జంట ఒకటి కనిపించింది. ఏం చేద్దాం. చేసే వాళ్ళకి సిగ్గు లేనపుడు మనం కూడా చూడ్డానికి సిగ్గు పడకూడదని వారి భావం కాబోలు...

Praveen Mandangi said...

ఆ అమ్మాయిలకి సమాజం గురించి తెలిసినట్టు లేదు. ఇండియా మనం అనుకున్నంత వెలుగు ఉన్న దేశం కాదు. వాళ్ళకి పెళ్ళికి ముందు కడుపు వచ్చి మగవాళ్ళు వాళ్ళని మోసం చేసి వదిలేస్తే తెలుస్తుంది.

కమల్ said...

మీరు చూసిన ఆ దృశ్యాలన్ని...ఈమద్య వచ్చినకాలం వి కావు..! భారతదేశంలో ఏ నగరానికి వెళ్ళినా అలాంటివే ఉంటాయి..! నగర జీవితాలకి..మమూలు టౌన్ జీవితాలకి జీవనవిదానంలోనూ, వ్యవహారాల్లో చాలా తేడా ఉంటుంది...! అది సహజం.. మీరు చూసిన దృశ్యాలు నేను 20 ఏళ్ళ క్రిందటనే మీరు చూసిన ప్రదేశాల్లో చూసాను..అప్పుడు మీలా నేను అనుకోలేదు కారణం..జీవినవిదాల్లో మార్పులుండడం..! అది గుర్తెరుగుతే మీకవన్ని..వింతగా అనిపించకపోవచ్చు..