Sunday, July 11, 2010

ఆడ మగ మధ్య స్నేహం

ఆడ మగ మధ్య స్నేహం చేస్తే జనాలు ఎందుకు వింత గా చెప్పుకుంటారు ? ఏం ? ఆడ మగ మధ్య స్నేహం వుండకూడదా ? అన్ని స్నేహాలకు ఒకటే అర్ధమా ? స్నేహానికీ కూడా హద్దులు పరిమితులు వున్నాయా ? అంటే వున్నాయనే చెప్పొచ్చు . కాలేజీలో , స్కూల్స్ లలో స్నేహం అంతవరకే వుండాలి . మాది పవిత్ర స్నేహం , మా మధ్య స్నేహం తప్ప ఏ అలోచనలు లేవంటే మన సమాజం హర్షించదు . మన పూర్వీకులు ఒక వయసు వచ్చిన ఆడపిల్లలని , తండ్రైనా , సోదరుడైనా దగ్గరకు తీసుకోవటానిని ఒప్పుకోలేదు . ఒక హద్దులోనే వుంచేవారు . కాదని మీద మీద పడుతున్న ఈ రోజులలో , పేపర్లో రోజూ , ఏదో ఒక చోట తండ్రి , కూతురి మీద అత్యాచారం చేసే ప్రయత్నం చేసాడని చదువుతునేవున్నాము .

ఈ మద్య మాకు తెలిసిన వారి అమ్మాయి ఒక అబ్బాయి తో తిరగటము చూసి , ఇంట్లో వాళ్ళూ కట్టడి చేసారు . ఆ అమ్మాయి , మాది స్నేహమే , ప్రేమ కాదు అని గొడవ చేసింది . ఐనా తండ్రి వినకుండా , ఆ అమ్మాయిన్ వేరే వూరు , తమ్ముడి దగ్గరకు పంపించి అక్కడ చదివిస్తున్నారు . ఆ అమ్మాయి తల్లితండ్రుల మీద ద్వేషం పెంచుకొని , వారు కాల్ చేసినా మాట్లాడదు . అక్కడికి వెళ్ళినా బయటకు కూడా రాదు . వారి మీద పగ పెంచుకున్నదే కాని వారు చేసిన మంచిని గ్రహించలేక పోతోంది . మన తల్లితండ్రులు , తోడబుట్టిన వారు తప్ప మన మంచిని కోరేది ఎవరు ?

ఇంకో చోట , 60 సంవత్స్రాలావిడ కు 20 సంవత్సరాల అబ్బాయి ఫ్రెండ్ . ఇద్దరూ కలిసి సినిమాలకు , ఆర్ట్ ఎక్జిబిషన్స్ కు వెళుతుంటారు . చిత్ర కళ నేర్చుకునే చోట ఫ్రెండ్స్ అయ్యారుట . మా అబ్బాయి కన్నా చిన్నవాడు అతని తో నాకు సంభంధం అంటగడుతారు ఏమి పాడు లోకం అని తిట్టిపోస్తుంది . ఆమెకూ ఇద్దరు అబ్బాయిలు , ఒక అమ్మాయి వున్నారు . మరి వాళ్ళ తో వెళ్ళ వచ్చుకదా సినిమాకి ? వాళ్ళు బిజీ అంటుంది . అంతే కాని రోజూ ఆ అబ్బాయి తో గంటల తరబడి మాటలు , సినిమాలకు , షికార్లకు చెక్కర్లూ చూసేవారికి ఎంత ఎబ్బెట్టుగా వుంటుందో గ్రహించుకోదు . మీ ఇద్దరికీ అంత మాటలు ఏముంటాయి అంటే ఏదో అడ్డం గా వాదిస్తుంది .మరి వాళ్ళాయన వారి పవిత్ర స్నేహాన్ని అర్ధం చేసుకున్నాడేమో తెలీదు .

కయ్యానికైనా , వియ్యానికైనా సరి జోడు వుండాలంటారు . అలాగే స్నేహానికి కూడా . సరి సమాన వయసు వారిలో నూ , ఏ జండర్ వారికి ఆ జండర్ వారి తోనూ వుంటేనే శోభిస్తుంది . లేకపోతే ఏదో వొక రోజు అది బెడిసి కొడుతుంది . సమాజము కన్నా ముందు , వయసు , వంటరి తనమే కొంపముంచుతుంది . అది అర్ధం చేసుకొని పెద్దల మాట వింటే మంచిది .

6 comments:

కమల్ said...
This comment has been removed by the author.
కమల్ said...

బాగుంది..మీ వాదన..! నాక్కాస్త నవ్వచ్చింది చదివాక..! ఎవరు ఎవరితో స్నేహం చేయాలి....!చేయకూడదూ...! అన్నది మరొకరు నిర్ణయిస్తారా..? ఎవరి ఆలోచనలు వారివి..ఎవరిష్టాలు వారివి..! మనకు నచ్చేలా ఎదుటివారు ప్రవర్తించాలి, నడుచుకోవాలి అని అనుకోవడం..శాసించడం..ఆశించడం అంత సబబుకాదేమో..!!!??

Anonymous said...

మీరు చెప్పాలని ప్రయత్నించిన విషయం బాగానే ఉంది కానీ 60,20 వయసున్న ఆడ, మగ మధ్య స్నేహాన్ని కూడా ఛండాలంగా విమర్శిస్తున్నారంటే మీ ఆలోచనా విధానం ఎలా ఉందో ఆలోచించుకోండి. ఇంతకీ ఇది ఆడ బ్లాగో, మగ బ్లాగో? ఖర్మ! వ్యాఖ్యానించచ్చో, లేదో? జండర్ తేడా ఉంటే ఎలాగో???

>>మరి వాళ్ళాయన వారి పవిత్ర స్నేహాన్ని అర్ధం చేసుకున్నాడేమో తెలీదు .
చీ, ఏమిటిది, ఇంత దిగజారాలా?

తాడేపల్లి said...

ఏ దేశమైనా ఆడ-మగ మధ్య బాంధవ్యమే తప్ప స్నేహం ఉండే అవకాశం లేనే లేదు. ఒకవేళ స్నేహం ఉంటే అది ఏదో ఒకరోజు శారీరిక సంబంధానికి దారితీయడం ఖాయం. ఈ జీవితసత్యాన్ని గ్రహించినవారంతా దిగజాఱినట్లు భావించడం సరికాదు. అయితే ఆ బాంధవ్యం ఏమిటై ఉండాలనేది ఆ ఆడా-మగా నిర్ణయించుకోవాలి. నేను నాకు పరిచయమున్న ఆడవాళ్ళందఱినీ "అమ్మా/ అక్కా" అని పిలుస్తాను. తద్ద్వారా నేను నా హద్దుల్లో, వారు వారి హద్దుల్లో ఉంటామని ఆశిస్తాను.

Praveen Mandangi said...

ఆడ-మగ మధ్య స్నేహానికి ద్వంద్వార్థాలు తియ్యడం అవసరమా?ఒకవేళ ఆ 20 ఏళ్ల కుర్రాడు కేవలం సెక్స్ కోసం స్నేహం చెయ్యాలనుకుంటే అతనికి 20-25 ఏళ్లు మధ్య వయసున్న అమ్మాయిలే చాలా మంది దొరుకుతారు. అందుకు 60 ఏళ్ల ఆవిడతో స్నేహం చెయ్యాలనుకోడు.

Kathi Mahesh Kumar said...

హ హ హ