Monday, June 8, 2009

అత్తగారిజీవిత ఖైదు

ఈ మద్య అత్తగార్ల ఘోష ఎక్కువయింది.ఒకప్పుదు కోడళ్ళు ఇబ్బంది పదితే ఇప్పుడు అత్తగార్ల వంతు వచ్చింది.నేను వుద్యొగము చేసినప్పుడు నాకు ఎవరూ సహకరించ లేదు,కోడలి కి సాయము చేద్దాం,నాకు చాతనైనంత సహకరిద్దాం అనుకోవతాకు,పైగా ముందు తరం వాళ్ళు కావటము వలన భర్త మాట కాదన్ లేక పోవతము, ఆ భర్త సమాజము కోసమో,కొడుకు మీద ప్రేమతోనో భార్య కి పురమాయించటము తో వాళ్ళను ఇబ్బందులలో పడవేస్తోంది.భర్తల సహకారము అప్పుడూ లేదు ,ఇప్పుడూ లేదు.కొడుకూ కొడలు ఎప్పుడు వస్తారో తెలీదు. వచ్చినా మన లోకం లో వుండరు.పిల్లలది ఒక్కక్కరిది ఒక్కో సమయము.ఉద్యోగ విరమన చేసి ,పిల్లల భధ్యత తీరింది హమ్మయ్య అనుకోవతాని కిలేదు.మళ్ళీ పిల్లలు,ఇల్లు,పనివాల్లు. అప్పుడు అత్తగరి సేవ ,ఇప్పుడు కొడలి సేవ .సాండ్విచ్ .జీవిత ఖైదు.

కోడలి సంగతి చూద్దామా అంటే కోడలు ,ఆమె తల్లి ప్రవర్తన మహా విచిత్రం.నేను నా అత్త దగ్గర కష్టాలు పడ్డాను నా కూతురు పడకూడదు అనుకోవటము లో తప్పు లేదు.అల్లాగే నా కూతురు పెద్ద పొజిషన్ కి వెళ్ళాలి,బాగా సంపాదించాలి అనుకోవటము లోను తప్పులేదు కాని అత్తగారి మీదికి ఎగదోయటమేమిటి?ఇంత చదివించింది అత్తగారికి సేవలు చేయటానికా అని డైలాగులేమితి?అల్లాంటప్పుడు కుతురునీ దగ్గరుంది చూసుకోవాలి.కాని చూడరు ఎందుకంటే వాళ్ళకి స్వాతంత్రం కావాలిగా!ఎంతైనా పెళ్ళైన ఆడపిల్ల అత్తవారింట్లో వుంది ఆవిద తో సేవలు చేయించుకోవటమే న్యాయం.

వారాని కి ఐదు రోజులు టార్గేట్ లను పూర్తి చేయటానికి గోల్ రీచ్ అవటానికే సరిపోతుంది.ఊపిరి తీసుకునే సమయమే వుండదు.మా కాఫ్ఫీ మేము తాగటా నికే టైం లేదు. ఇక అత్తాగారికేం ఇస్తాము?అని హైటెక్ కొడలు సమాదానము. మరి మిగిలిన రెండు రోజులూ?అల్సిన సరీరానికి విశ్రాంతి వద్ద? సరేనమ్మా అత్తమామల సంగతి సరే, మీరు మోసి కష్టపడి కని, చనుపాలిచ్చిన పిల్లల సంగతేమిటి?అప్పుడప్పుడు బొమ్మలతో ఆడు కున్నట్లు ఆడూకోని,వీకెంద్ లో మాల్ల్ కి తీసుకెల్లి షాప్పింగ్ చేస్తే అయిపోతుందా?స్చూల్ కి లక్షలు ఫీస్ కడుతున్నాము వాళ్ళదే బాద్యత ,తుషన్ తీచర్ కి వేలకు వేలు జీతాలిస్తున్నాము ,అత్తగారికి పని లేకుండా పనివాళ్ళను పెత్తాము ఇంకేంచేయాలి?

ఇంకేం వద్దు.మీరు కావలసినన్ని లక్షలు మూటగట్టుకోని,బోలెడ్డన్ని ప్రమోషన్లు పొంది, కేరియర్ పెంపొందించుకున్నాక అప్పుడు మీరెక్కివచ్చిన మెట్ల కింద నలిగి పోయిన వారిని చూసి సంతోషిస్థారో విచారిస్తారో మీ ఇస్టం.కాని ఒక సలహా కేరియర్ కావాలి అనుకున్నప్పుడు సంసార జంజాటం పెట్టుకో కుండా వుంటే మంచిది.

4 comments:

హను said...

చాలా బాగా రాశారు, మీ వివరణ చాలా బాగుంది.

MOVIE said...

www.telugugola.com

Sujata M said...

మీ వేదన అర్ధం అయింది. అంత కెరీర్ ఓరియెంటెండ్ కోడలు ఇంటి పన్లకో పనిమనిషిని పెట్టుకోవడం ఉత్తమం. అత్త అయినా, అమ్మ అయినా, పెద్ద వయసు స్త్రీ లను ఇబ్బంది పెట్టడం కన్నా, వాళ్ళని కేవలం 'పెద్ద దిక్కు ' లా ఇంట్లో చూసుకుంటూ, పన్లకి మాత్రం పనమ్మాయి లాంటి ఏర్పాటు చేసుకుంటే ఎవరికీ బాధ ఉండదు. ఈ నొచ్చుకోవడాలూ ఉండవు. నేనూ అత్తగారిమీద డిపెండ్ అయిన కోడల్నే ! ఈ డిపెండ్ కావడం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోదలచుకోలేదు. ముఖ్యంగా అత్తగారయినా, కోడలయినా - ఒకరి స్పేస్ లోకి ఒకరు రానంత వరకూ హాయి హాయి గా కలిసిమెలిసి ఉండొచ్చని నా ఫీలింగ్.

aavedana said...

సుజాత గారూ,
ఇది ఏవక్కరి వేదననో కాదండి.గత ఐదారు సంవత్సరాలు గా ప్రతి ఫంక్షన్ లో డైరెక్ట్ గా ఇండైరక్ట్ వింటున్న చర్చల సారాంసము.